రికార్డులు బద్దలు కొడుతున్న మహేష్ బాబు
BY Admin10 Aug 2021 10:16 AM GMT
X
Admin10 Aug 2021 10:16 AM GMT
సర్కారువారి పాట సినిమాతో మహేష్ బాబు అప్పుడే రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా అంటూ బర్త్ డే బాస్లర్ తోపాటు బద్దలు అవుతున్న రికార్డుల గురించి చిత్ర యూనిట్ అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
24 గంటల్లోనే సర్కారువారి పాట బర్త్ డే బ్లాస్టర్ కు ఏకంగా 25.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయని మైత్రీ మూవీమేకర్స్ వెల్లడించింది. టాలీవుడ్ చరిత్రలో 24 గంటల్లోనే అత్యధిక మంది చూసిన వీడియోగా ఇది నిలిచిందని పేర్కొన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేఫ్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.
Next Story