Telugu Gateway
Cinema

మహేష్ బాబు కూడా 'తాళం వేశాడు'

మహేష్ బాబు కూడా తాళం వేశాడు
X

టాలీవుడ్ లో ఈ మధ్య ఖర్చీప్ లు వేసే కార్యక్రమాలు మరీ ఎక్కువ అయిపోయాయి. ఎప్పుడో ఏడాది తర్వాత విడుదల చేసే సినిమాలకు కూడా ఇప్పుడే డేట్లు చెప్పేస్తున్నారు. ఇది అంతా ఏంటి అంటే ఇది మా స్లాట్..ఇందులోకి ఎవరూ రావొద్దని ఓ రకంగా సంకేతం ఇవ్వటం వంటిదే. కాదు కూడదు అని ఎవరైనా వచ్చినా కూడా మేం ముందు చెప్పాం కాబట్టి..మాకే ఛాన్స్ ఇవ్వాలి అని బేరం పెట్టుకోవటానికి ఓ ఛాన్స్ కూడా ఉంటుంది కదా అన్న ఆలోచన మరొకటి. ఎన్నో సార్లు విడుదల తేదీలు మార్చుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా దగ్గర నుంచి చాలా సినిమాలు ఈ మధ్య 'ముందస్తు' విడుదల తేదీలను ప్రకటించేస్తున్నాయి. ఒకరికి ఒకరు పోటీ కాకుండా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుందాం అన్న చందంగా సాగుతుంది ఈ వ్యవహారం అంతా.

అందులో భాగంగా తాజాగా మహేష్ బాబు కూడా లైన్ లోకి వచ్చారు. సంక్రాంతి పండగ పోయి సరిగ్గా పక్షం రోజులు కావస్తోంది. ఈ తరుణంలో వచ్చే సంక్రాంతికి అంటే..2022 జనవరిలో విడుదల కాబోయే 'సర్కారు వాటి పాట' సినిమా తేదీని అప్పుడే ప్రకటించేశారు కూడా. అంటే ఏకంగా ఏడాది ముందు చెబుతున్నట్లు అన్న మాట. చేతిలో పాత తాళాలతో వచ్చిన మహేష్ బాబు వచ్చే సంక్రాంతి డేట్ ను ఫిక్స్ చేశాడు. తాజాగా దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. మహేష్ బాబు, కీర్తి సురేష్ లు షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Next Story
Share it