అదరగొట్టిన మహాసముద్రం ట్రైలర్ విడుదల
మహాసముద్రం ట్రైలర్ విడుదల అయింది. శర్వానంద్, సిద్ధార్ధ లు హీరోలుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో అదితిరావు హైదరీ, అను ఇమాన్యుయల్ లు హీరోయిన్లుగా నటించారు. సముద్రం చాలా గొప్పది మామా. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది అంటూ శర్వానంద్ చెప్పే డైలాగుతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఇక్కడ మనం నచ్చినట్లు బతకాలంటే మన జాతకాన్ని దేవుడు మందుకొట్టి రాసి ఉండాలి అంటూ చాలా సీరియస్ గా డైలాగ్ చెబుతాడు శర్వానంద్.
నేను దూరదర్శన్ లో మహాభారత యుద్ధం చూసిన మనిషిని రా అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ సూపర్. ఎదుటోడు వేసిన బాణానికి ఏ బాణం వేయాలో నాకు బాగా తెలుసు అంటూ ప్రత్యేక మేనరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. మీరు చేస్తే నీతి..మేం చూస్తే బూతా అంటూ సిద్ధార్ధ చెప్పే సీరియస్ డైలాగ్ లతో ట్రైలర్ కట్ చేశారు. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అనిల్ సుంకర నిర్మాతగా ఉన్నారు. జగపతిబాబు కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు.