'మగధీర' పన్నెండు సంవత్సరాలు
BY Admin31 July 2021 12:38 PM IST
X
Admin31 July 2021 12:38 PM IST
టాలీవుడ్ లో 'మగధీర' సినిమా నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. రామ్ చరణ్ సినిమా కెరీర్ లోనే ఇది ఓ రికార్డుగా నిలిచింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వచ్చి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ ఈ సినిమాకు సంబంధించిన విషయాలను షేర్ చేసింది.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఇప్పుడు రెండవ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ తోపాటు ఎన్టీఆర్ మరో హీరోగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎన్ని రికార్డులు నెలకొల్పుతుందో అన్న ఆసక్తి అందరిలో ఉంది.
Next Story