Telugu Gateway
Cinema

మ్యాడ్ 2 ఫస్ట్ సింగిల్ 20 న

టాలీవుడ్ లో ఇప్పుడు సీక్వెల్స్ సీజన్ నడుస్తోంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఇదే బాట పడుతున్నాయి. ముఖ్యంగా సక్సెస్ ఆధారంగానే వీటిని కొనసాగిస్తున్నారు. కొన్నిసార్లు ఇవి బోల్తాకూడా కొడుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ డబుల్ ఇస్మార్ట్ మూవీ నే. ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం దక్కించుకోవటంతో దర్శకుడు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కించారు. కానీ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసింది. కానీ ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల అయి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపిన డీ జె టిల్లు..ఆ తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ లు ఎంతటి ఘన విజయం దక్కించుకున్నాయో తెలిసిందే.

ఈ మధ్య కాలంలో కొన్ని చిన్న సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకుంటున్నాయి. గత ఏడాది అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని దక్కించుకోవటంతో సితార ఎంటర్టైన్మెంట్స్ మ్యాడ్ 2 కూడా ప్రకటించింది. బుధవారం నాడు చిత్ర యూనిట్ మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. అంతే కాదు...ఫస్ట్ సింగిల్ ను కూడా సెప్టెంబర్ 20 న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు సందడి చేయనున్నారు. మ్యాడ్ మూవీ ని తెరకెక్కించిన కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలోనే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా తెరకెక్కుంతోంది.

Next Story
Share it