మా ఎన్నికలు..ప్యానల్ ప్రకటించిన ప్రకాష్ రాజ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల హడావుడి ప్రారంభం అయింది. ఈ ఎన్నికల బరిలో నిలిస్తున్న ప్రకాష్ రాజ్ మీడియాముందుకు వచ్చి తమ ప్యానల్ ను ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో జీవితా రాజశేఖర్, హేమ కూడా చేరారు. ఈ సారి 'మా'అధ్యక్ష బరిలో పలువురు పోటీ పడుతుండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ కొద్ది రోజుల క్రితం ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి తమ ప్యానల్ సభ్యులను వెల్లడించారు.
అందరి ఆమోదంతోనే ప్యానల్ ప్రకటిస్తున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. సినిమా బిడ్డల పేరుతో ప్యానల్ జాబితాను వెల్లడించారు. వాస్తవానికి జీవితా రాజశేఖర్, హేమలు కూడా ప్రెసిడెంట్ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. తమ ప్యానల్ అధికార ప్రతినిధులుగా సాయికుమార్, బండ్ల గణేష్ లను నియమిస్తున్నట్లు తెలిపారు. తమ ప్యానల్ తరపున ఈ వివరాలు అయినా వీరే వెల్లడిస్తారన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ వివరాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్ లో డ్రగ్స్ అంశంపై కూడా ఆయన స్పందించారు. తప్పు చేసినట్లు తేలితే ఎవరిపై అయినా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఇది భవిష్యత్ తరాలకు సంబంధించిన అంశం అన్నారు.
ప్యానల్ వివరాలు:
1. అధ్యక్షుడు- ప్రకాశ్‌రాజ్
2. ట్రెజరర్-నాగినీడు
3. జాయింట్ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్
4. ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ
5. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్
6. జనరల్ సెక్రటరీ: జీవితా రాజశేఖర్
ప్రకాశ్ రాజ్ ఎక్స్‌క్యూటివ్ మెంబెర్స్ జాబితా ఇదే:
1. అనసూయ
2. అజయ్
3. భూపాల్
4. బ్రహ్మాజీ
5. ప్రభాకర్
6. గోవింద రావు
7. ఖయూమ్
8. కౌశిక్
9. ప్రగతి
10. రమణా రెడ్డి
11. శివా రెడ్డి
12. సమీర్
13. సుడిగాలి సుధీర్
14. సుబ్బరాజు. డి
15. సురేష్ కొండేటి
16. తనీష్
17. టార్జాన్