Telugu Gateway
Cinema

బాల‌కృష్ణ మ‌ద్ద‌తు కోరిన మంచు విష్ణు

బాల‌కృష్ణ మ‌ద్ద‌తు కోరిన మంచు విష్ణు
X

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల‌కు సమ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో గెలుపు కోసం ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉన్నారు. ప్ర‌కాష్ రాజ్ ఆదివారం నాడు మా స‌భ్యుల‌తో ఓ విందు స‌మావేశం ఏర్పాటు చేసుకున్నారు. మంచు విష్ణు కూడా వ‌ర‌స పెట్టి సీనియ‌ర్ల‌ను క‌లుస్తూ మ‌ద్ద‌తు కోరుతున్నారు. ఆయ‌న శ‌నివారం నాడు హీరో కృష్ణను క‌ల‌సి ఆశీర్వాదం తీసుకున్నారు. మంచు విష్ణుతోపాటు మోహ‌న్ బాబు కూడా కృష్ణ నివాసానికి వెళ్ళారు. ఆదివారం నాడు విష్ణు మ‌రో హీరో నంద‌మూరి బాల‌కృష్ణను క‌ల‌సి త‌మ ప్యాన‌ల్ కు మ‌ద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. బాల‌కృష్ణను క‌ల‌సిన ఫోటోల‌ను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు విష్ణు. అవి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

నన్ను ఆశీర్వదించి, మా ప్రెసిడెంట్‌గా నాకు మద్ధతు ఇచ్చినందుకు ధన్యవాదాలు బాల అన్న అంటూ విష్ణు ట్వీట్‌ చేశారు. అఖండ సెట్‌కు వెళ్లిన మంచు విష్ణు ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడారు. మా ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌చారం జోరందుకుంది. ఇప్పటికే మా అధ్యక్ష పదవికి సీవీఎల్‌ నరసిం‍హరావు, జనరల్ సెక్రెటరీ పదవికి బండ్ల గణేష్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరోవైపు అక్టోబర్‌ 10న మా ఎ‍న్నికలు జరుగనున్నవిష‌యం తెలిసిందే.

Next Story
Share it