Telugu Gateway
Cinema

'మా' ఎన్నిక‌ల్లోకి వైసీపీ నేత‌ ఎలా వ‌చ్చాడు?

మా  ఎన్నిక‌ల్లోకి వైసీపీ నేత‌ ఎలా వ‌చ్చాడు?
X

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల వ్య‌వ‌హారం మ‌రో మ‌లుపు తిరిగింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్రెసిడెంట్ గా పోటీ చేసి ప‌రాజ‌యం పాలైన ప్ర‌కాష్ రాజ్ శుక్ర‌వారం నాడు సంచ‌ల‌న ఫోటోలు విడుద‌ల చేశారు. వైసీపీ నేత‌గా...రౌడీషీట‌ర్ గా ఉన్న వ్య‌క్తి ఎలా మా ఎన్నిక‌లు జ‌రిగే ప్రాంతాల్లోకి అనుమ‌తించార‌ని ఎన్నిక‌ల అధికారి క్రిష్ణ‌మోహ‌న్ కు లేఖ రాశారు. అక్ర‌మాల‌కు ఆధారాలు ఇవిగో అంటూ ఫ‌లు ఫోటోలను విడుద‌ల చేశారు. తాజాగా సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన ప్రకాశ్ రాజ్ 'మా' ఎన్నికల్లో అక్రమాలు నిజమేనంటూ సాక్ష్యాలు బైట పెట్టారు. క్రిమినల్ రికార్డు ఉన్న వైసీపీ నేతను వెంటబెట్టుకుని పోలింగ్‌లో మంచు ఫ్యామిలీ పాల్గొన్న ఫోటోలు ప్రకాష్‌రాజ్ రిలీజ్ చేశారు.

తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఆ ఫోటోలో ఉన్నది రౌడీషీటర్‌ నూకల సాంబశివరావు అన్నారు. రౌడీషీటర్‌ నూకల సాంబశివరావు హాల్‌లో ఉన్నట్టు సాక్ష్యాలు చూపించారు ప్రకాశ్ రాజ్. మా సభ్యులు కాని వ్యక్తులను ఎలా అనుమతించారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. నూకల సాంబశివరావు అనే వ్యక్తి ఓటర్లను బెదిరించారని చెప్పారు. విష్ణు ప్యానెల్‌ బ్యాడ్జిలు పెట్టుకుని వైసీపీ కార్యకర్తలు 'మా' ఎన్నికల్లో చొరబడ్డారని తెలుపుతూ జగన్‌, మోహన్‌బాబు, విష్ణుతో వైసీపీ కార్యకర్త దిగిన ఫోటోలను ప్రకాశ్ రాజ్ చూపారు. సాంబ‌శివ‌రావు వైసీపీ కండువా వేసుకుని సీఎం జ‌గ‌న్ తో ఉన్న ఫోటోలు కూడా విడుద‌ల చేశారు.

Next Story
Share it