Telugu Gateway
Cinema

లైకా చేతికి 'ఆర్ఆర్ఆర్' హక్కులు

లైకా చేతికి ఆర్ఆర్ఆర్ హక్కులు
X

భారీ చిత్రాల నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్ బుధవారం నాడు కీలక ప్రకటన చేసింది. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబంధించి థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అతి పెద్ద పాన్ ఇండియా సినిమా అయిన ఆర్ఆర్ఆర్ హక్కులు కొనుగోలు చేయటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కన్పించనున్నారు. డీవీవీ బ్యానర్ పై ఈ మూవీ నిర్మాణం సాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అజయ్ దేవ్ గన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Next Story
Share it