Telugu Gateway
Cinema

'ల‌వ్ స్టోరీ' విడుద‌ల వాయిదా..కార‌ణాలు అవే!!

ల‌వ్ స్టోరీ విడుద‌ల వాయిదా..కార‌ణాలు అవే!!
X

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన సినిమా 'ల‌వ్ స్టోరీ'. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ విడుద‌ల తేదీ ముంచుకొస్తున్నా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఈ సినిమా విడుద‌ల వాయిదాప‌డిన‌ట్లే అని నిర్దార‌ణ అవుతోంది. ఇప్ప‌టికే సెప్టెంబ‌ర్ 10న గోపీచంద్ హీరోగా న‌టించిన ' సీటిమార్' సినిమా విడుద‌ల అవుతోంది. అయితే శేఖ‌ర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'ల‌వ్ స్టోరీ' సినిమా విడుద‌ల వాయిదా వెన‌క చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని స‌మాచారం. కోవిడ్ కేసుల తీవ్రత తగ్గినా కూడా ప్రేక్షకులు ఇంకా థియేటర్ల‌కు పూర్తి స్థాయిలో రావ‌టానికి ఏ మాత్రం ఆస‌క్తిచూప‌టంలేద‌ని గ్ర‌హించే చిత్ర యూనిట్ వెనక్కి త‌గ్గినట్లు చెబుతున్నారు.

వాస్త‌వానికి 'ల‌వ్ స్టోరీ' మూవీ యూనిట్ కూడా ఓటీటీ విడుద‌ల‌కే మొగ్గుచూపింది. నాని సినిమా ట‌క్ జ‌గ‌దీష్ ను ఒటీటీల విడుద‌ల చేయ‌టంపై ఎగ్జిబిట‌ర్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ల‌వ్ స్టోరీ సినిమాను థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాల‌ని నిర్ణయించుకున్నారు. కానీ చాలా చోట్ల ప్రేక్షకులు థియేట‌ర్ల‌కు రావ‌టం ఏ మాత్రం ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌టంతో ఈ సినిమా యూనిట్ అంతా విడుద‌ల‌పై పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు చెబుతున్నారు. ఈ లెక్క‌న ల‌వ్ స్టోరీ కూడా ద‌స‌రా బ‌రిలో నిలుస్తుందా..లేక మ‌రే తేదీని ఎంచుకుంటుందా అన్న‌ది వేచిచూడాల్సిందే. సారంగ‌ద‌రియా సాంగ్ తో ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్ కు పెరిగిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it