Telugu Gateway
Cinema

ఆహాలో ల‌వ్ స్టోరీ మూవీ..అక్టోబ‌ర్ 22 నుంచి

ఆహాలో ల‌వ్ స్టోరీ మూవీ..అక్టోబ‌ర్ 22 నుంచి
X

ల‌వ్ స్టోరీ సినిమా థియేట‌ర్ల‌లో చూడ‌ని వాళ్ల‌కు శుభ‌వార్త‌. అక్టోబ‌ర్ 22 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో ఇది అందుబాటులో ఉంటుంది. బాక్సాఫీస్ వ‌ద్ద కూడా ఈ సినిమా మంచి ఫ‌లితాన్ని రాబ‌ట్టింది. ముఖ్యంగా సాయిప‌ల్ల‌వి డ్యాన్స్ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ఈ ప్రేమ‌క‌థ‌ను ప‌లు సున్నిత‌మైన అంశాల‌ను ట‌చ్ చేస్తూ తెర‌కెక్కించారు. అక్కినేని నాగ‌చైత‌న్య కూడా ఈ సినిమాలో మంచి న‌ట‌న క‌న‌ప‌ర్చారు. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని బుల్లితెర ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ త‌రుణంలో ఆహా దసరా కానుకగా తీపి కబురు చెప్పింది.

థియేటర్లలో భారీ విజయం సొంతం చేసుకున్న 'లవ్ స్టోరీ' ఇక ఆహాలో ఏ స్టాయిలో విజయం సాధిస్తుందో వేచిచూడాలి. 12 వారాలు... 90 రోజులు... 20 కొత్త సినిమాలు, షోలు. ఈ దసరా నుండి సంక్రాంతి వరకు అదిరిపోయే నాన్ స్టాప్ 100 శాతం తెలుగు వినోదాల పండగ, మీ అహలో సిద్ధమా? అంటూ ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట‌ర్ ను షేర్ చేసింది. అందులో ప‌లు కొత్త సినిమాలు కూడా ఆహా లో విడుద‌ల కానున్న‌ట్లు తెలిసిపోతుంది. అందులో ల‌వ్ స్టోరీతోపాటు మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచుల‌ర్, గ‌ని, లక్ష్య, అనుభ‌వించురాజా, రొమాంటిక్, పుష్ప‌క విమానం తదిత‌ర సినిమాలు ఉన్నాయి.

Next Story
Share it