Telugu Gateway
Cinema

అదనపు సన్నివేశాలతో

అదనపు సన్నివేశాలతో
X

ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల అయి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ దక్కించుకున్న మూవీ లిటిల్ హార్ట్స్. ఈ మూవీ సెప్టెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో ఈ మూవీ దూసుకెళ్లింది..కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డు లు నమోదు చేసింది. సినీ సెలెబ్రిటీలు కూడా లిటిల్ హార్ట్స్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ లు పెట్టడం కూడా ఈ మూవీకి కలిసివచ్చింది అనే చెప్పాలి. ఇందులో మౌళి తనూజ్ హీరోగా ...శివాని నగరం హీరోయిన్ గా నటించింది.

సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా ఇప్పటికే ఇది ప్రపంచ వ్యాప్తంగా 33 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ మూవీ ఇప్పుడు ఓటిటి డేట్ ను ఫిక్స్ చేసుకుంది. లిటిల్ హార్ట్స్ అక్టోబర్ ఒకటి నుంచి ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అదనపు సన్నివేశాలతో ఓటిటి లోకి దీన్ని తీసుకురానున్నారు. ఈ లెక్కన ఓటిటి లో మరింత ఫన్ యాడ్ అవుతున్నట్లే లెక్క. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపిన ఈ సినిమా ఓటిటి లో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Next Story
Share it