Telugu Gateway
Cinema

'లైగ‌ర్' టీమ్ రిలాక్సేష‌న్

లైగ‌ర్ టీమ్ రిలాక్సేష‌న్
X

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య‌పాండే జంట‌గా న‌టిస్తున్న సినిమా లైగ‌ర్. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలోని లాస్ వెగాస్ లో జ‌రుగుతోంది. భారీ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రిత‌మే అక్క‌డికి త‌ర‌లివెళ్లిన విష‌యం తెలిసిందే. బాక్సింగ్ క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఏకంగా మైక్ టైస‌న్ కూడా వ‌చ్చి చేర‌టంతో దీనిపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను పూరీ, ఛార్మీతోపాటు క‌ర‌ణ్ జోహ‌ర్ లు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఇది తెర‌కెక్కుతోంది. షూటింగ్ విరామ స‌మ‌యంలో ఛార్మికౌర్, అన‌న్య‌పాండే, పూరీతో క‌ల‌సి దిగిన ఫోటోను విజ‌య్ దేవ‌ర‌కొండ షేర్ చేశారు.

Next Story
Share it