Telugu Gateway
Cinema

మ‌ళ్ళీ బ‌రిలోకి దిగిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

మ‌ళ్ళీ బ‌రిలోకి దిగిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌
X

'లైగర్‌' సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన ఫోటోను హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేశారు. పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో విజ‌య్ కు జోడీగా బాలీవుడ్ భామ అన‌న్య పాండే న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ పాన్‌ ఇండియా సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడ‌క్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్ ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. తాజా లుక్ లో విజయ్ జుట్టుతో షర్ట్‌లేకుండా బాక్సింగ్‌ రింగ్‌లో కూర్చొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రక్తం.. చెమట.. హింస' అంటూ ఈ ఫొటోకి విజయ్‌ క్యాప్షన్ జోడించారు.

Next Story
Share it