కొత్త విడుదల తేదీ ప్రకటించిన నాగార్జున

లెనిన్ సినిమా విడుదల మరో సారి వాయిదా పడింది. ఫస్ట్ ఈ మూవీ మే 1 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత విడుదల తేదీని జూన్ 26 కి మార్చారు. ఇప్పుడు ఈ సినిమా విడుదల మరో సారి వాయిదా పడినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అదే సమయంలో కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించింది. అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ సినిమా జులై 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను అక్కినేని నాగార్జున తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.



