Telugu Gateway
Cinema

న‌వంబ‌ర్ 12న నాగ‌శౌర్య 'లక్ష్య'

న‌వంబ‌ర్ 12న నాగ‌శౌర్య లక్ష్య
X

నాగ‌శౌర్య‌, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టించిన సినిమా లక్ష్య. ఈ సినిమా న‌వంబ‌ర్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ సోమ‌వారం నాడు ప్ర‌క‌టించింది. దీంతో నాగ‌శౌర్య సినిమాలు విడుద‌ల‌కు క్యూక‌ట్టిన‌ట్లు అయింది. అక్టోబ‌ర్ లో ఈ హీరో న‌టించిన వ‌రుడు కావ‌లెను విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు లక్ష్య విడుద‌ల తేదీ ప్ర‌క‌టించారు. సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో స‌చిన్ ఖ‌డేక‌ర్, జ‌గ‌ప‌తిబాబులు ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషించారు.

Next Story
Share it