'ఆచార్య'లో చిరంజీవి డ్యాన్స్ అదుర్స్
BY Admin30 March 2021 1:51 PM GMT
X
Admin30 March 2021 1:51 PM GMT
ఒకప్పుడు టాలీవుడ్ లో డ్యాన్స్ అంటే చిరంజీవే. ఆ తరం హీరోల్లో చిరంజీవి తన స్పీడ్ డ్యాన్స్ లతో సత్తా చాటారు. కొత్తతరం హీరోలు వచ్చాక ఆ డ్యాన్స్ అందరూ మర్చిపోయారు. కానీ ఇప్పుడు 'ఆచార్య' సినిమాతో చిరంజీవి తనలో డ్యాన్స్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు సంబంధించి లాహేలాహే పాట ప్రొమోను చిత్ర యూనిట్ ను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది.
పూర్తి పాటను బుధవారం విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా..రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తొలిసారి చిరంజీవి మావోయిస్టుల కథకు సంబంధించిన సినిమాలో నటిస్తున్నారు.
Next Story