Telugu Gateway
Cinema

కృతిశెట్టి లుక్ అదిరింది

కృతిశెట్టి లుక్ అదిరింది
X

కొత్త కొత్త‌గా కృతిశెట్టి. న్యూలుక్ అదిరింది. ఇది బంగార్రాజు సినిమాలోది. ఈ సినిమాలో కృతిశెట్టి అక్కినేని నాగ‌చైత‌న్య‌కు జోడీగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఆమె పాత్ర పేరు నాగ‌ల‌క్ష్మీ. ఈ పాత్ర‌ను ప‌రిచయం చేస్తూ చిత్ర యూనిట్ గురువారం నాడు ఈ లుక్ ను విడుద‌ల చేసింది. ఇది ప్రేక్షకుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. సొ్గ్గాడే చిన్న‌నాయ‌నా సినిమాకు కొన‌సాగింపుగా ఈ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. నాగార్జున‌కు జోడీగా ఇందులో ర‌మ్య‌క్రిష్ణ సంద‌డి చేయ‌నున్నారు.

కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే విడుద‌ల చేసిన పాట‌కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ కుషీలో ఉంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి నాగార్జున ప్రయత్నిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్డూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.

Next Story
Share it