ఆదిపురుష్ సీత
పాన్ ఇండియా హీరో ప్రభాస్ కొత్త సినిమా ఆదిపురుష్ శరవేగంగా తుదిమెరుగులు దిద్దుకొంటోంది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా టీజర్ విడుదల సమయంలో చిత్ర యూనిట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అసలు ఇందులో ప్రభాస్ హీరో నా..లేక ఇది గ్రాఫిక్స్ మూవీనా అంటూ దర్శకుడు ఓం రౌత్ పై ప్రభాస్ ఫాన్స్ పెద్ద ఎత్తున మండిపడ్డారు. అదే సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా నాసి రకంగా ఉన్నాయని ఘాటుగా స్పందించారు. దీంతో చిత్ర యూనిట్ దీనికి మరిన్ని మెరుగులు దిద్దటానికి సినిమా విడుదలను వాయిదా వేసింది. కొత్త విడుదల తేదీని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమా జూన్ 16 న ప్రపంచ వ్యాఫంగా విడుదల కానుంది.
సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తుండటంతో ప్రొమోషన్స్ వేగం పెంచినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా మూవీ యూనిట్ శనివారం నాడు హీరోయిన్ కృతి సనన్ న్యూ లుక్ విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా. కృతి సనన్ సీతగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఓం రౌత్ దర్శకత్వంలో భూషన్‌కుమార్ నిర్మిస్తున్నారు. లంకలో ఉన్న ఆమె రాముడి రాక కోసం కంటతడితో ఎదురుచూస్తున్నట్లు ఆ పోస్టర్‌లో కనిిపించారు. ‘అమరం అఖిలం,, సీతారాముల నామం’ అంటూ కొత్త పోస్టర్‌లను యు.వి క్రియేషన్స్ సంస్థ ట్వ్టిట్టర్ వేదికగా విడుదల చేసింది. ప్రభాస్ ఒకవైపు ఆదిపురుష్ తో పాటు ప్రశాంత్ నీల్ తో కలిసి సాలార్ సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని ప్రాజెక్ట్ కెలో కూడా చేస్తున్నారు.