రామ్ కు జోడీగా కృతిశెట్టి
టాలీవుడ్ లో ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తొలి సినిమానే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో ఈ హీరోయిన్ కు ఆఫర్ల మీద ఆపర్లు వచ్చిపడుతున్నయి. ఇప్పుడు అందరి కళ్ళు ఆ అమ్మాయి మీదే ఉన్నాయి. నానితో కలసి ఓ సినిమాలో సందడి చేయనుంది. ఇప్పుడు హీరో రామ్ కు జోడీగా కూడా ఈ హీరోయిన్ పేరు ఖరారైనట్లు టాక్. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కృతిశెట్టిని ఓకే చేసినట్లు చెబుతున్నారు.
నాని 'శ్యామ్ సింగరాయ్', సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ రా బోయే రోజుల్లో కృతిశెట్టి డేట్స్ దొరకటం కూడా కష్టం అవుతుందని వ్యాఖ్యనించారు. ఆమె అంత బిజీగా అవుతుంది టాలీవుడ్ లో అన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఆమెకు వరసపెట్టి అవకాశాలు వస్తున్నాయి.