Telugu Gateway
Cinema

'క్రాక్' ట్రైలర్ విడుదల

క్రాక్ ట్రైలర్ విడుదల
X

రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా 'క్రాక్'. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శృతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు మలినేని గోపీచంద్, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది.

జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ట్రైలర్ చూస్తే పూర్తి స్థాయి మాస్, మసాలా ఎంటర్ టైనర్ గా ఈ మూవీ కన్పిస్తోంది. గత కొంత కాలంగా రవితేజ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. మరి క్రాక్ అయినా హిట్ ఇస్తుందో లేదో వేచిచూడాల్సిందే.

Next Story
Share it