Telugu Gateway
Cinema

సంక్రాంతికి రవితేజ 'క్రాక్'

సంక్రాంతికి రవితేజ క్రాక్
X

ఈ సారి టాలీవుడ్ లో సంక్రాంతికి సందడి ఎక్కువగా ఉండనుంది. ఎప్పుడూ సంక్రాంతికి రెండు, మూడు పెద్ద సినిమాలు సహజమే అయినా..ఈ సారి కరోనా దెబ్బ కారణంగా ఏ ఏడాది పెద్ద సినిమాలతోపాటు పలు సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ సారి అందరి దృష్టి సంక్రాంతిపైనే పడింది. ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతికి క్యూ కడుతున్నాయి. దసరా సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ లో రవితేజ, శృతిహాసన్ జంటగా నటించిన 'క్రాక్' సినిమా కూడా సంక్రాంతికే విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం క్రాక్ సినిమాకు సంబంధించి పాట షూటింగ్ సాగుతోంది. దీంతోపాటు హీరో రామ్ కు చెందిన రెడ్ సినిమాను కూడా 2021 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ దసరా పోస్టర్ సందర్భంగా చెప్పేశారు. ఇవే కాకుండా పలువురు పెద్ద హీరోల సినిమాలను కూడా సంక్రాంతికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాలీవుడ్ టాక్. మరి ఈ సారి సంక్రాంతి సందడి ఓ రేంజ్ లో ఉండనుంది.

Next Story
Share it