'భూమ్ బద్దలు' అంటున్న రవితేజ
BY Admin14 Nov 2020 5:39 PM IST
X
Admin14 Nov 2020 5:39 PM IST
రవితేజ, శృతిహాసన్ జంటగా నటిస్తున్న సినిమా 'క్రాక్'. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ ను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేసింది. నటి అప్పసరాణి, రవితేజల ఎనర్జిక్ స్టెప్స్ తో ఈ పాటలో ఓ ఊపు తెచ్చారు. 'భూమ్ బద్దలు..భూమ్ బద్దలు నా ముద్దుల సౌండ్' అంటూ సాగే పాట హుషారుగా సాగుతుంది.
ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి ఈ మూవీ విడుదల అయ్యే అవకాశం ఉంది. క్రాక్ లో వరలక్షి శరత్ కుమార్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జానీ మాస్టర్ ఈ పాటకు స్టెప్పులు వేయించారు. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
Next Story