Telugu Gateway
Cinema

సోష‌ల్ మీడియాకు కొర‌టాల శివ గుడ్ బై

సోష‌ల్ మీడియాకు కొర‌టాల శివ గుడ్ బై
X

టాలీవుడ్ లోని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల్లో కొర‌టాల శివ ఒక‌రు. ఆయ‌న సినిమాల్లో ఏదో ఒక ప్ర‌త్యేక‌ సందేశం ఇస్తూ వాణిజ్య విలువ‌లు జోడిస్తారు. అలా చేస్తూనే విజ‌యాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయ‌న సోష‌ల్ మీడియాకు గుడ్ బై చెప్పాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న చేశారు. మ‌నం క‌లిసే మాధ్య‌మం మారొచ్చు త‌ప్ప‌..మ‌న మ‌ధ్య బంధం మాత్రం మార‌దు అంటూ అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించారు. 'నేను తీసే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా మీతో పంచుకున్నాను.

కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నా. ఇకపై మీడియా మిత్రుల ద్వారా ప్రతి అప్‌డేట్‌ అందిస్తూ ప్రేక్షకులకు చేరువలోనే ఉంటాను. ' అంటూ కొరటాల ట్వీట్ చేశారు. అయితే ఆయ‌న ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొంత కాలంగా చాలా మంది సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

Next Story
Share it