Telugu Gateway
Cinema

కొండ‌పొలం ట్రైల‌ర్ విడుద‌ల‌

కొండ‌పొలం  ట్రైల‌ర్ విడుద‌ల‌
X

'గొర్రెల కాప‌రుల కుటుంబం. త‌ల్లితండ్రుల‌కు చ‌దువు లేదు. ఏ కోచింగ్ లో సెంట‌ర్ లో ట్రైన్ అయ్యారు.' అంటూ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్న‌. దీనికి అడ‌వి స‌ర్..న‌ల్ల‌మ‌ల్ల అడ‌వి అంటూ హీరో వైష్ణ‌వ్ తేజ్ చెప్పే స‌మాధానంతో ప్రారంభం అవుతుంది 'కొండ‌పొలం' ట్రైల‌ర్. ఉప్పెన మూవీ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన త‌ర్వాత వైష్ణ‌వ్ తేజ్, ర‌కుల్ ప్రీత్ సింగ్ తో క‌ల‌సి చేస్తున్న సినిమా ఇది.

ఉద్యోగం కోసం నాలుగేళ్లు ప్ర‌య‌త్నించి మ‌ళ్లీ ఊర్లో గొర్రెల కాప‌రిగానే మార‌తాడు హీరో. చ‌దువుకున్న గొర్రె చ‌దువుకోని గొర్ర‌తో మాట్లాడింది చూసిన‌వా అంటూ ర‌కుల్ ప్రీత్ సింగ్ చెప్పే డైలాగ్ వెరైటీగా ఉంది ఈ ట్రైల‌ర్ లో. క్రిష్ జాగ‌ర్త‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను ఫ‌స్ట్ ప్రేమ్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మించింది. అక్టోబ‌ర్ లోనే సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ వెల్ల‌డించింది.

Next Story
Share it