Telugu Gateway
Cinema

ఆక‌ట్టుకుంటున్న ఆర్ఆర్ఆర్ కొమ‌రం భీముడో పాట‌

ఆక‌ట్టుకుంటున్న ఆర్ఆర్ఆర్ కొమ‌రం భీముడో పాట‌
X

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి భీమ్ తిరుగుబాటు (Revolt of Bheem) పేరుతో చిత్ర యూనిట్ శుక్ర‌వారం సాయంత్రం ఓ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. 'భీమా నిన్ను క‌న్న నేల త‌ల్లి...ఊరిపిపోసిన చెట్టు చేమా, పేరు పెట్టిన గోండు జాతిని నీతో మాట్లాడుతున్నా. విన‌బ‌డుతోందా?' అంటూ భీమ్ పాత్ర‌ను ప‌రిచేసిన త‌ర్వాత కొమ‌రం భీముడో..కొమ‌రం భీముడో అంటూ భైర‌వ ఆల‌పించిన ఈ గీతం ఆక‌ట్టుకునేలా ఉంది.ఇందులో విజువ‌ల్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌కొస్తుండ‌టంతో చిత్ర యూనిట్ ఓ రేంజ్ లో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది.

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో పాటు హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, ఆలియా భ‌ట్ కూడా గ‌త కొన్ని రోజులుగా ఇదే ప‌నిలో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఎన్టీఆర్ కు సంబంధించి విడుద‌లైన ఈ పాట కూడా సినిమా ఎంత గ్రాండ్ తో ఉండ‌బోతుందో స్ప‌ష్ట‌మైన సంకేతాలిచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ పాట రావ‌టంతో త్వ‌ర‌లో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌కు సంబంధించి కూడా ఇదే త‌ర‌హా వీడియో రావ‌టం ఖాయంగా భావిస్తున్నారు.

Next Story
Share it