Telugu Gateway
Cinema

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ఆహా లో

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ఆహా లో
X

దీపావళి రేస్ లో పోటీని తట్టుకుని నిలబడి విజయం సాధించిన సినిమాల్లో కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన కె ర్యాంప్ మూవీ ఒకటి. ఈ దీపావళికి తెలుగు నుంచే సిద్దు జొన్నలగడ్డ నటించిన తెలుసుకదా మూవీ తో పాటు మిత్రమండలి, కె ర్యాంప్ తో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమా డ్యూడ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కె ర్యాంప్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని దక్కించుకుంది.

తొలుత ఈ సినిమా విషయంలోకి మిశ్రమ స్పందన వ్యక్తం అయినా కూడా తర్వాత ఊపందుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఏకంగా దగ్గర దగ్గర 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన ఈ మూవీ ఇప్పుడు ఓటిటిలోకి వస్తోంది. నవంబర్ 15 నుంచి ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రాజేష్ దండా నిర్మించారు. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ను ఎక్కువగా ఆకట్టుకుంది.

Next Story
Share it