Telugu Gateway
Cinema

ఇంద్ర పుత్ర తో సత్తా చాటుతాడా?!

ఇంద్ర పుత్ర తో సత్తా చాటుతాడా?!
X

కిరణ్ అబ్బవరం ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా స్టోరీ ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే గొప్ప మహా సంగ్రామం అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీకి ఇంద్రపుత్ర అనే టైటిల్ ని ఫిక్స్ చేసి...టైటిల్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇంద్రపుత్ర మూవీ వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా ప్రెజంట్ చేయబోతున్నాయి. ఈ యువ హీరో నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇటీవల విడుదల అయి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకుంది.

అదే జోష్ లో ఇప్పుడు తొలిసారి ఒక పౌరాణిక చిత్రం ద్వారా పాన్ ఇండియా సినిమా లో నటించబోతున్నాడు. ‘కాంతార చాప్టర్ 1’ మూవీకి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ పుప్పాల ఈ పాన్-ఇండియా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా రానుంది అని..ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది విడుదల చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇందులో నటించే ఇతర నటీ, నటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Next Story
Share it