Telugu Gateway
Cinema

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా
X

కిరణ్ అబ్బవరం. గత కొంత కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ యువ హీరో నటించిన సినిమాలు వరసగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కొద్దిగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నాడు. బుధవారం నాడు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఒక అక్షరం క పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అంతే కాదు..ఇది ఈ హీరో తొలి పాన్ ఇండియా మూవీ కూడా. తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఇది విడుదల కానుంది.

టైటిల్ తో న్యూ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం కు జోడిగా తన్వి రామ్ నటిస్తోంది. ఈ సినిమా కు రచన, దర్శకత్వం సుజిత్ అండ్ సందీప్ . విలేజ్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యం విష్ణు కథ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితం సాధించినా కూడా రూల్స్ రంజన్, నేను మీకు బాగా తెలుసు, సెబాస్టియన్ వంటి సినిమాలు దారుణ ఫలితాన్ని చవిచూశాయి.

Next Story
Share it