Telugu Gateway
Cinema

కే ర్యాంప్ ప్రారంభం

కే ర్యాంప్ ప్రారంభం
X

గత ఏడాది క సినిమా తో మంచి హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా కూడా క మూవీ నిలిచిన విషయం తెలిసిందే. ఈ నెలలోనే దిల్ రుబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో కిరణ్ కు జోడిగా రుక్సార్ ధిల్లాన్ నటించింది. ఒక సినిమా విడుదలకు రెడీ అవుతున్న తరుణంలో సోమవారం నాడు కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాకు కూడా వెరైటీ గా కే ర్యాంప్ అంటే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఈ మూవీ లో కిరణ్ కు జోడిగా యుక్తి నటిస్తోంది. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజేష్ దండ నిర్మిస్తున్నారు. సోమవారం నాడు హైదరాబాద్ లో రామా నాయుడు స్టూడియో లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. స్పోర్ట్స్ డ్రామా కథ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇందులో నరేష్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Next Story
Share it