Telugu Gateway
Cinema

కిరణ్ అబ్బవరం రికార్డు వసూళ్ల సినిమా

కిరణ్ అబ్బవరం రికార్డు వసూళ్ల సినిమా
X

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా క. ఈ హీరో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా ఇదే. ఒక వెరైటీ కథ, టైటిల్ తో ఈ సినిమా దీపావళికి అంటే అక్టోబర్ 31 ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. క సినిమాలో కిరణ్ అబ్బవరం కు జోడిగా నయన్ సారిక నటించింది. సందీప్, సుజీత్ ల దర్శక ద్వయం ఎంతో కాన్ఫిడెంట్ గా ఈ సినిమా ను తెరకెక్కించి మంచి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ సినిమా ఇప్పుడు ఓటిటి డేట్ లాక్ చేసుకుంది. ఈ సక్సెస్ ఫుల్ మూవీ నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ దీపావళికి ఒకే సారి దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలు కూడా రంగంలో నిలిచినా క మాత్రం మంచి వసూళ్లతో హిట్ దక్కించుకుంది.

Next Story
Share it