Telugu Gateway
Cinema

ఫస్ట్ పాన్ ఇండియా మూవీ

ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
X

యువ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘క’. ఇది ఈ హీరో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కూడా. ఈ సినిమా టైటిల్ చాలా వెరైటీ గా పెట్టి అందరి దృష్టిని అయితే ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. ఈ మూవీ ఇప్పుడు అక్టోబర్ 31 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘క’ సినిమాలో కిరణ్ అబ్బవరం కు జోడిగా నయన్ సారిక, తన్వీ రామ్ నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాల్సిందే. కిరణ్ గత సినిమాలు వరసగా బాక్స్ ఆఫీస్ వద్ద చేదు ఫలితాన్ని చవిచూశాయి. దీంతో ఆయన కొంత గ్యాప్ తీసుకుని ఈ సినిమాతో వస్తున్నాడు.

Next Story
Share it