Telugu Gateway
Cinema

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ఫస్ట్ లుక్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ఫస్ట్ లుక్
X

క సినిమా తో మంచి హిట్ అందుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఈ ఏడాది మార్చిలో విడుదల అయిన దిల్ రుబా సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు కె ర్యాంప్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు ఈ హీరో. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. అదే సమయంలో ఇందులోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. కె ర్యాంప్ మూవీ 2025 దీపావళికి విడుదల కానుంది. ఇది కిరణ్ అబ్బవరం పదకొండవ సినిమా. కె ర్యాంప్ ఫస్ట్ లుక్ లో కిరణ్ అబ్బవరం లుంగీ కట్టుకుని స్టెప్ వేస్తూ కనిపిస్తాడు.

ఈ సినిమాను రాజేష్ దండా, శివ బొమ్మక్ లు హాస్య మూవీస్, రుద్రాంష్ సెల్లులాయిడ్స్ బ్యానర్స్ మీద తెరకెక్కిస్తున్నారు. జైన్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం కు జోడిగా యుక్తి తనేజా నటిస్తోంది . పూర్తి స్థాయి ఎంటర్ టైన్మెంట్ మూవీగా కె ర్యాంప్ ని తీసుకురానున్నట్లు హీరో వెల్లడించారు. యుక్తి తనేజా గతంలో తెలుగు లో రంగబలి సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఉన్ని ముకుందన్ హీరో గా తెరకెక్కిన మార్కో సినిమాలో కూడా చేసింది.

Next Story
Share it