మరో చారిత్రక సినిమా

బాక్స్ ఆఫీస్ దగ్గర చారిత్రక సినిమాలు మంచి ఫలితాన్ని రాబడుతున్నాయి. దీంతో గత కొంత కాలంగా ఈ తరహాల సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మంచి కథ తో తెరకెక్కిన సినిమాలు అంతే స్థాయిలో వసూళ్లు కూడా రాబడుతున్నాయి. ఇప్పుడు అదే బాటలో మరో భారీ సినిమాకు రంగం సిద్ధం అయింది. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రముఖ చక్రవర్తి శ్రీ శ్రీష్ణదేవరాయల కథతో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ స్టార్ హీరో చక్రవర్తి కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ అందించింది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఎలుగెత్తి చాటిన శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో సుదీప్ నటించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.



