రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వాణీ

సంచలన సినిమాల దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ ను ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వాణీ నటించనున్నారు. గతంలో వీరిద్దరూ కలసి వినయ విధేయ రామ సినిమాలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇది రామ్ చరణ్ 15వ సినిమా అయితే . దిల్ రాజు కు చెందిన వెంకటేశ్వర క్రియేషన్స్ కు ఇది 50వ సినిమా కావటం విశేషం.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం చేతిలో ఉన్న ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ అయితే రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఇక ఆచార్య కూడా తుది దశలోనే ఉంది. ఇవి పూర్తికాగానే రామ్ చరణ్ ఈ కొత్త ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.