Telugu Gateway
Cinema

అంతా ఖుషి అంటున్న మైత్రీ

అంతా ఖుషి అంటున్న మైత్రీ
X

భారీ అంచనాల మధ్య విడుదల అయిన సినిమా ఖుషి. విజయ్ దేవరకొండ, సమంత లు కలిసి నటించిన ఈ సినిమాపై మిశ్రమ స్పందనలు వ్యక్తం అయ్యాయి. యూత్ లో ఎంతో క్రేజ్ ఉన్న విజయ్ సినిమా అంటే ఫుల్ జోష్ ఉంటుంది. అలాంటిది హైదరాబాద్ ఐమాక్స్ వంటి ముల్టీప్లెక్స్ లో ఆదివారం నాటి మార్నింగ్ షో లు పూర్తి ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.. అయితే ఈ సినిమా విడుదల అయిన సెప్టెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా 30 .01 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. ఫ్యామిలీస్ ఖుషి...బాక్స్ ఆఫీస్ ఖుషి అంటూ ఎక్స్ లో వసూళ్ల పోస్ట్ ను షేర్ చేసింది.

Next Story
Share it