Telugu Gateway
Cinema

'కుషీ' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

కుషీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
X

'కుషీ' ఈ పేరుతో వ‌చ్చిన ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇప్పుడు అదే టైటిల్ తో విజ‌య‌దేవ‌ర‌కొండ సినిమా రాబోతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ్ , స‌మంత‌లు జంట‌గా న‌టిస్తున్న ఈసినిమాకు 'కుషీ' టైటిల్ ను పిక్స్ చేసిన‌ట్లు చిత్ర యూనిట్ సోమ‌వారం నాడు వెల్ల‌డించింది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

ఇప్ప‌టికే చిత్ర యూనిట్ కాశ్మీర్ లో ఫలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. డిసెంబ‌ర్ 23న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించారు. ఈ లుక్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌ల డ్రెస్ కు ముడి వేసి ఉంది. కాశ్మీర్ కొండ‌ల మ‌ధ్య బ్యూటీ ఫుల్ ప్ర‌దేశంతో దీన్ని విడుద‌ల చేశారు. తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయ‌నున్నారు.

Next Story
Share it