'ఖిలాడి'పై అంత కాన్ఫిడెన్సా!
టాలీవుడ్ లో ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. ఏదైనా సినిమా మాంచి విజయం సాధిస్తే రెమ్యునరేషన్ కు అదనంగా బహుమతులు ఇస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న విషయమే. అయితే రవితేజ హీరోగా నటిస్తున్న 'ఖిలాడి' సినిమా విషయంలో ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇంతకు చాలా ముందుగానే దర్శకుడు రమేష్ వర్మకు ఈ సినిమా నిర్మాత కోనేరు సత్యనారాయణ కోటి రూపాయలపైగా విలువ చేసే ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు.
ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చల్ చల్ చేస్తుండటంతో చిత్ర యూనిట్ ఈ సినిమాపై అంత కాన్ఫిడెన్స్ గా ఉందా? లేక ఇదో కొత్త తరహా వ్యవహరమా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా కూడా ఖిలాడి నిర్మాత నిర్ణయం మాత్రం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతితోపాటు మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ప్రముఖ నటుడు అర్జున్ ఓ కీలక పాత్రలో నటించారు.