కెజీఎఫ్ 3 కూడా రాబోతుందా?.

ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. గురువారం నాడు విడుదలైన కెజీఎఫ్ 2 సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ యశ్ ను ఈ సినిమాలో ఓ సూపర్ హీరోగా చూపించి విజయం సాధించారు. అంతే కాదు..బాలీవుడ్ లోనూ ఏకంగా తొలి రోజే రికార్డు వసూళ్ళు సాధించినట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసి ఈ సినిమాపై హైప్ మరింత తీసుకొచ్చారు. సినిమా క్లైమాక్స్ లో కన్పించిన సీన్ ఒకటి కెజీఎఫ్ 3 కూడా ఉండబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. కెజీఎఫ్ 2 సినిమా ముగింపు సమయంలో రవీనా టాండన్ ఓ పుస్తకాన్ని సీరియస్ గా చూస్తూ ఉంటారు..దానిపై కెజీఎఫ్ 3 అని రాసి ఉండటంతో మూడవ భాగం కూడా పక్కా అని యశ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ కెజీఎఫ్ 3 కూడా తీయాలంటూ ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతున్నారు. మరి చిత్ర యూనిట్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ అంశం ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. భారీ బడ్జెట్‌తో నిర్మించిన కేజీఎఫ్ 2లో యష్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు.
ఆర్ఆర్ఆర్ తో పోలిస్తే ఎక్కడా పెద్ద హడావుడి చేయకుండా ప్రమోషన్స్‌లో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ లు కూల్ గా ఉన్నారు. మీడియా నుంచి కెజీఎఫ్ 3పై ప్రశ్నలు వెలువడినా వాళ్లు దీనిపై నేరుగా ఎలాంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే కెజీఎఫ్ 2 క్లైమాక్స్ లో చూపించిన సన్నివేశంతో మూడవ భాగం కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ వసూళ్ళను అందుకున్నా ఆశ్చర్యంలేదనే టాక్ నడుస్తోంది. యశ్ ఈ సినిమా రెండు భాగాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇదిలా ఉంటే ఒకవేళ కెజీఎఫ్ 3 పట్టాలెక్కించాలన్నా కూడా దీనికి చాలా సమయం పడుతుందని భావిస్తున్నారు. దీనికి కారణం ప్రశాంత్ నీల్ చేతిలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఉండటమే.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT