కెజీఎఫ్ 2కు వసూళ్ల వర్షం
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశ వ్యాప్తంగా కెజీఎఫ్ 2 వసూళ్లు దుమ్మురేపుతున్నాయి. ఈ సినిమా విడుదల అయిన గురువారం నాడు తెలుగు రాష్ట్రాల్లో 31 కోట్ల రూపాయల గ్రాస్..19.09 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించింది. ఇప్పటివరకూ ఏ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రాలేదు. ఇది ఆల్ టైమ్ రికార్డుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే..ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్ లు..హీరోయిజం ఎలివేషన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిపి కెజీఎఫ్ 2ను ఎక్కడో నిలబెట్టాయి. దీంతో తొలి రోజు ఈ సినిమా ఓవరాల్‌గా 134.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి..మరోసారి సౌత్ సినిమాల సత్తా ఏంటో యావత్ దేశానికి తెలియజేసింది.
బాలీవుడ్‌లోనే దాదాపు రూ.50 కోట్లను వసూళ్లు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ 'రోబో 2.O'(రూ.12.45 కోట్లు) ఉండేది. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కలిసి మరో రూ.50 కోట్లు వసూలు చేసిందని అంచనా.. మొత్తంగా తొలిరోజు రాకీభాయ్ విధ్వంసమే సృష్టించాడు. కెజీఎఫ్ 2లోని ప్రతి పాత్రాను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. విలన్ గా నటించిన అధీరా పాత్రకు, హీరోకు మధ్య అవసరమైన బలమైన సంఘర్షణ లేకపోయినా..అధీరా లుక్ తో సంజయ్ దత్ వావ్ అన్పించాడు. అదే సమయంలో ప్రధాని పాత్ర పోషించిన ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కూడా తన పాత్రలో దుమ్మురేపింది.