కెజీఎఫ్ 2 కలెక్షన్ల ఊచకోత..నాలుగు రోజుల్లో 551 కోట్లు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజీఎఫ్ చాఫ్టర్ 2 కలెక్షన్ల ఊచకోత కోస్తుంది. ఒక్క తమిళనాడులో తప్ప..మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా వసూళ్లు దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ సినిమా వసూళ్ళు చూసి షాక్ కు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. కెజీఎఫ్ 2 ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా అంతే స్థాయిలో వస్తున్నాయి. ఈ సినిమా విడుదలకి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కూడా రికార్డులు నమోదు చేసింది. విడుదల అయిన మొదటి రోజు దాదాపు అన్ని భాషల్లో 165 కోట్లు కలెక్ట్ చేసింది.
కెజీఎఫ్ 2 ప్రతి రోజు 100 కోట్లకి పైగా గ్రాస్‌ని సాధించి కేవలం నాలుగు రోజుల్లోనే 500 కోట్లకి పైగా కలెక్షన్లను రాబట్టింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు మనోబాలా విజయబాలన్ ఈ సినిమా వసూళ్ళకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో.. 'కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500కోట్ల మైలురాయిని దాటేసింది' అని వెల్లడించారు. 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' రోజువారీ గ్రాస్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి..మొదటిరోజు - రూ.165.37 కోట్లురెండోరోజు - రూ.139.25 కోట్లుమూడోరోజు - రూ.115.08 కోట్లునాలుగోరోజు - రూ.132.13 కోట్లుమొత్తం - రూ. 551.83 కోట్ల వసూళ్ళు వచ్చాయన్నారు.