Telugu Gateway
Cinema

కెజీఎఫ్ 2 టీజర్ వచ్చేసింది

కెజీఎఫ్ 2 టీజర్ వచ్చేసింది
X

కెజీఎఫ్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంకా కాదు. అందుకే ఇప్పుడు కెజీఎఫ్ 2పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా కేజీఎఫ్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. వాస్తవానికి యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న చిత్ర టీజర్‌ను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

అయితే ఒక రోజు ముందుగానే నెట్టింట్లో లీక్ కావడంతో.. కొద్దిసేపటి క్రితమే దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్ర టీజర్‌ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ అపియరెన్స్, అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ,.. ఫైటింగ్ సీన్స్ తో టీజర్ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్‌తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ లో భాగం కావడంతో కెజీఎఫ్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story
Share it