Telugu Gateway
Cinema

దుమ్మురేపుతున్న 'కెజిఎఫ్‌-2 ట్రైల‌ర్'

దుమ్మురేపుతున్న  కెజిఎఫ్‌-2 ట్రైల‌ర్
X

సేమ్ టూ సేమ్. కెజీఎఫ్ పై ఎంత క్రేజ్ క్రియేట్ అయిందో..కెజీఎఫ్ 2పై కూడా అలాగే ఉంది ట్రెండ్. ఈ ట్రైల‌ర్ కు వ‌స్తున్న స్పంద‌న చూస్తుంటే ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. కన్నడ స్టార్‌ హీరో యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను కెజిఎఫ్‌-2. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్‌14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ జోరు పెంచిన చిత్ర బృందం నిన్న(ఆదివారం) ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

అయితే ఒక్కరోజులోనే ఈ ట్రైలర్‌ అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తుందికేవలం 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్‌ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ట్రైలర్‌కి కన్నడ భాషలో 18మిలియన్‌ వ్యూస్‌, తెలుగులో 20M,హిందీలో 51M, తమిళంలో 12M, మలయాళంలో 8మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. 'రికార్డ్స్‌.. రికార్డ్స్‌.. రికార్డ్స్‌.. రాఖీకి ఇది ఇష్టం ఉండదు, అందుకు తప్పించుకుంటాడు. కానీ రికార్డ్స్‌ రాఖీని ఇష్టపడతాయి. అందుకే వాటి నుంచి తప్పించుకోలేడు' అంటూ మేకర్స్‌ ట్వీట్‌ చేశారు.

Next Story
Share it