కెజీఎఫ్ 2 విడుదల తేదీ వచ్చేసింది
BY Admin29 Jan 2021 1:25 PM GMT
X
Admin29 Jan 2021 1:25 PM GMT
చెప్పినట్లే చేశారు. శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ కెజీఎఫ్ 2 విడుదల తేదీ ప్రకటించేసింది. ఈ సినిమా జులై 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన కెజీఎఫ్ 2 టీజర్ యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొట్టింది. కెజీఎఫ్ తొలి భాగం సూపర్ హిట్ కావటం ఒకెత్తు అయితే...పార్ట్ 2లో హీరో యశ్ తో పాటు సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి వారు కూడా జత చేరయటంతో దీనిపై క్రేజ్ మరింత పెరిగింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాతోనే హీరో యశ్ ఒక్కసారిగా జాతీయ స్టార్ గా మారిపోయారు. బాక్సాఫీస్ వద్ద కెజీఎప్2 ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే.
Next Story