Telugu Gateway
Cinema

కంగనాకు నష్టపరిహారం..హైకోర్టు ఆదేశం

కంగనాకు నష్టపరిహారం..హైకోర్టు ఆదేశం
X

బృహన్ ముంబయ్ కార్పొరేషన్ (బీఎంసీ)కి షాక్. కంగనా రనౌత్ కు బిగ్ రిలీఫ్. ముంబయ్ బాంద్రాలోని కంగనా ఆఫీసును బృహన్‌ ముంబయ్ కార్పొరేషన్‌ (బీఎంసీ) కూల్చివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. చట్ట ప్రకారం నిర్మించిన భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని బీఎంసీ అధికారుల తీరుపై న్యాయస్థానం మండిపడింది. పిటిషనర్‌కు జరిగిన నష్టాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలతో పాటు ముంబయ్ ను పీవోకేతో పోల్చుతు కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అనంతరం చోటుచేసుకున్న పరిణామాల ఫలితంగా బాంద్రాలోని కంగనా కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిందని ఆరోపిస్తూ బీఎంసీ అధికారులు దాన్ని కూల్చేందుకు సిద్ధమైయ్యారు. బీఎంసీ అధికారులు నిర్ణయాన్నీ సవాలు చేస్తూ కంగనా హైకోర్టును ఆశ్రయించగా.. కూల్చివేతపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. కంగనా కార్యాలయాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తీర్పులో పేర్కొంది.

Next Story
Share it