Telugu Gateway
Cinema

'పుష్ప‌' మూవీ చూసిన క‌మ‌ల్ హాస‌న్

పుష్ప‌ మూవీ చూసిన క‌మ‌ల్ హాస‌న్
X

అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న‌లు క‌ల‌సి న‌టించిన సినిమా పుష్ప బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా సంద‌డి చేస్తోంది. తాజాగా పుష్ప సినిమాను దేవీశ్రీ ప్ర‌సాద్ తో క‌ల‌సి ప్ర‌ముఖ హీరో క‌మ‌ల్ హాస‌న్ వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోల‌ను దేవిశ్రీప్ర‌సాద్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. హీరో అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా చూసిన క‌మ‌ల్ హాస‌న్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. పుష్ప: ద రైజ్‌ను తెరకెక్కించిన సుకుమార్ రెండో భాగాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి.. డిసెంబ‌ర్ నాటికి రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

Next Story
Share it