Telugu Gateway
Cinema

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా
X

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మంచి హిట్ ఇచ్చిన సినిమా అంటే బింబిసార. ఇప్పుడు అదే మూవీ కి ప్రీక్వెల్ రానుంది. కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. ఇది కళ్యాణ్ రామ్ 22 వ సినిమా. అయితే బింబిసార సినిమాను తెరకెక్కించింది దర్శకుడు వశిష్ఠ అయితే ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కు మాత్రం అనిల్ పాడూరి దర్శకత్వం వహించనున్నారు. త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యాన్ని బింబిసార కంటే ముందు ప‌రిపాలించిన చ‌క్ర‌వ‌ర్తి కథతో ఈ సినిమాను తెర‌క‌క్కించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

ఎన్ కెఆర్ 22 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను పిలవనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు బహిర్గతం కానున్నాయి. కళ్యాణ్ రామ్ 21 వ సినిమాకు చెందిన న్యూ లుక్ ను కూడా ఆయన పుట్టిన రోజు పురస్కరించుకుని శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా సాయి మంజ్రేకర్ నటిస్తుంటే...విజయశాంతి మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Next Story
Share it