Telugu Gateway
Cinema

ట్రైలర్ మరింత బజ్ పెంచుతుందా!

ట్రైలర్  మరింత బజ్ పెంచుతుందా!
X

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ బాక్స్ ఆఫీస్ పైనే . భారీ బడ్జెట్ సినిమాలు వరసగా క్యూ కట్టనున్నాయి. జూన్ నెలలో అందరి దృష్టి కల్కి పైనే ఉంది అని చెప్పాలి. ప్రభాస్ హీరో గా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో సాగుతున్నాయి. ఇప్పుడు అత్యంత కీలక మైన ట్రైలర్ డేట్ కూడా వచ్చేసింది. కల్కి ట్రైలర్ జూన్ పదిన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

ప్రభాస్ కు జోడిగా ఇందులో దీపికా పడుకొనే నటిస్తోంది. ఆమెతో పాటు దిశా పటాని కూడా సందడి చేయనుంది. ఇతర కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు నటిస్తున్నారు. ఇప్పటికే కల్కి పై పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ కాగా...ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను ఎంత మేర పెంచుతుందో వేచిచూడాల్సిందే. సంచలన దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు లు క్రియేట్ చేయటం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి.

Next Story
Share it