Telugu Gateway
Cinema

అందరి కళ్ళు అటు వైపే!

అందరి కళ్ళు అటు వైపే!
X

విజయవంతమైన చిత్రాలు ఓటిటి లోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసే వాళ్ళు చాలా మందే ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాలకు పెరిగే టికెట్ ధరలతో పాటు వివిధ కారణాల వల్ల కొంత మంది థియేటర్లకు పోవటం మానేసి ఓటిటి లోకి వచ్చిన తర్వాతే చూస్తున్నారు. సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలకు ఓటిటి లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది అనే విషయం కూడా తెలిసిందే. ప్రభాస్ హీరో గా తెరకెక్కిన కల్కి 2898 ఏ డీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు అందరిలో ఈ సినిమా ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందా అన్న ఆసక్తి పెరిగిపోయింది.

టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ పది వారాల తర్వాతే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది అని చెపుతున్నారు. ఈ లెక్కన కల్కి సెప్టెంబర్ రెండవ వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కల్కి సినిమా భారత్ లో పలు రికార్డు లను అధిగమించుకుంటూ దూసుకు వెళుతోంది.

Next Story
Share it