Telugu Gateway
Cinema

ఫుల్ జోష్ లోనే కల్కి బుకింగ్స్

ఫుల్ జోష్ లోనే కల్కి బుకింగ్స్
X

సంచలన దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు లు బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది. శుక్రవారం నాటికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. కల్కి సినిమా కు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ బుకింగ్స్ కూడా ఎంతో మెరుగ్గా ఉన్నాయి. మరో వైపు ఈ వారం అసలు వేరే సినిమా కూడా ఏదీ విడుదల కాకపోవటంతో కల్కి తప్ప మరో మూవీ లేదు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో పాటు సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే వంటి భారీ తారాగణం ఉన్న సినిమా కావటంతో వేరే సినిమా విడుదలకు ఎవరూ సాహసం కూడా చేయలేదు అనే చెప్పాలి.

జులై 12 న భారతీయుడు 2 విడుదల వరకు కల్కి కలెక్షన్స్ కు ఢోకా ఉండదు అనే అంచనాలు ఉన్నాయిపరిశ్రమ వర్గాల్లో. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే కల్కి లో కీలక పాత్రలో కనిపించిన కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 పై కూడా భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ మూవీని తెరకెక్కించారు. దేశ వ్యాప్తంగా కల్కి బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాతో పాటు ఇతర ఓవర్సీస్ మార్కెట్స్ లో కూడా కల్కి సినిమా వసూళ్లు కొత్త కొత్త రికార్డు లు నమోదు చేశాయి.

Next Story
Share it